ఇద్దరు కుమార్తెలు.. ఉద్యోగులే | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు కుమార్తెలు.. ఉద్యోగులే

Sep 27 2026 12:46 AM | Updated on Sep 27 2026 12:46 AM

తాంసి: మగపిల్లలు లేరని బాధపడలేదు ఆ తండ్రి. ఇద్దరు కుమార్తెలను బాగా చదివించి ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దారు. ఇందులో ఒకరు అధ్యాపకురాలిగా విధులు నిర్వర్తిస్తుండగా.. మరొకరు సాఫ్ట్‌వేర్‌గా కొనసాగుతున్నారు. బేల మండలంలోని దహేగాం గ్రామానికి చెందిన జి.అతుల్‌కుమార్‌–అనిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఈయన ప్రస్తుతం భీంపూర్‌ ఎంపీవోగా విధులు నిర్వహిస్తున్నాడు. మొదటి కుమార్తె శామిలీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో లెక్చరర్‌ కొలువు సాధించారు. జిల్లా కేంద్రంలోని బాలికల ప్రభుత్వ కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. రెండో కుమార్తె ప్రంజలి వాల్యూ ల్యాబ్స్‌లో సాఫ్ట్‌వేర్‌గా కొనసాగుతున్నారు. ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో తన బిడ్డలను ఉన్నతంగా చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దినట్లు చెబుతున్నాడు అతుల్‌కుమార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement