ఆదిలాబాద్: బేల మండలం అవాల్‌పూర్‌కు చెందిన ఉపాధ్యాయ దంపతులు మినక పద్మ–జలంధర్‌రెడ్డిల ఏకై క కుమార్తె డాక్టర్ ప్రజ్ఞా రెడ్డి ఎంబీబీఎస్ పూర్తి చేసి కుటుంబానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి, పట్టుదలతో ముందుకు సాగిన ఈమె వైద్య విద్యను విజయవంతంగా పూర్తిచేశారు. ప్రస్తుతం పీజీ ప్రవేశానికి సిద్ధమవుతున్నారు. ‘మా కుమార్తె తన కాళ్లపై తాను నిలబడాలి.. తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్నదే మా ఆకాంక్ష.. అందుకే ఆమెకు అడుగడుగునా ప్రోత్సాహం అందించాం..’ అని తల్లిదండ్రులు చెబుతున్నారు. మంచి వైద్యురాలిగా సమాజానికి సేవ చేయాలన్నదే తమ కోరిక అని పేర్కొంటున్నారు.


