ఒకే కుటుంబంలో ఇద్దరు డాక్టర్లు | - | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబంలో ఇద్దరు డాక్టర్లు

Sep 27 2026 12:46 AM | Updated on Sep 27 2026 12:46 AM

ఆదిలాబాద్‌: పట్టణంలోని ద్వారకానగర్‌కు చెందిన సంద అశోక్‌–సవిత దంపతుల ఇద్దరు కుమార్తెలు. ఇరువురూ వైద్యరంగంలో తమదైన గుర్తింపు సాధిస్తున్నారు. అశోక్‌ టీఎన్జీవో మాజీ అధ్యక్షుడిగా, ఉపాధి శిక్షణ శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. పెద్ద కుమార్తె డాక్టర్‌ ఆమని ఎండీఎస్‌ ఆర్థోడెంటిస్ట్‌గా బెంగళూరులో సొంత ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. చిన్న కుమార్తె డాక్టర్‌ అఖిల ఎండీ జనరల్‌ ఫిజీషియన్‌గా హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత విద్యను అభ్యసించిన ఈ అక్కాచెల్లెళ్లు తమ వృత్తిలో ముందుకు సాగుతూ కుటుంబానికి, జిల్లాకు గర్వకారణంగా నిలుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement