నైపుణ్యాలు పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

Sep 27 2026 12:46 AM | Updated on Sep 27 2026 12:46 AM

● ఐటీడీఏ పీవో మంద మకరందు

ఉట్నూర్‌రూరల్‌: గిరిజన యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. ఉట్నూర్‌ యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లతో పాటు వివిధ సంస్థల్లో ఉద్యోగాలు సాధించిన యువతకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో చదువుతో పాటు నైపుణ్యాలు, క్రమశిక్షణ, సమయపాల న ఎంతో అవసరమని అన్నారు. మార్కెట్‌ అవసరా లకు అనుగుణంగా గిరిజన యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ ఇస్తూ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వై టీసీ కృషిని అభినందించారు. కార్యక్రమంలో ఏ పీవో జనరల్‌ జాదవ్‌ వసంత్‌ రావు, ఏపీఓ పీవీటీజీ భాస్కర్‌, డీడీ అశోక్‌, డిప్యూటీ ఈవో చందన్‌, డీహెచ్‌ఎస్‌వో సందీప్‌, ఐటీఐ ప్రిన్సిపాల్‌ ఆర్‌. శ్రీని వాస్‌, జేడీఎం నాగభూషణ్‌ పాల్గొన్నారు.

నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

కేంద్ర గ్రంథాలయ భవన నిర్మాణ పనుల్లో నాణ్యతతో గడువులోపు పూర్తి చేయాలని పీవో అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే గిరిజన యువతకు అవసరమైన పుస్తకాలు, అధ్యయన సామగ్రితో పాటు డిజిటల్‌ లెర్నింగ్‌ సదుపాయాలు, విశాలమైన పఠన వాతావరణం కల్పించేలా ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement