కై లాస్‌నగర్: జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం కల్పిస్తున్నామని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రపంచ ప ర్యాటక దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించి మా ట్లాడారు. కుంటాల, పొచ్చెర జలపాతాలు, మావ ల పార్కుతో పాటు కేస్లాపూర్ నాగోబా, జైనథ్, సిరి చెల్మ ఆలయాల ప్రాముఖ్యతను వివరిస్తూ ఇన్‌ఫ్లూయేన్సర్లు రూపొందిస్తున్న రీల్స్, వీడియోలు యూ ట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్‌లలో మిలియన్ల కొద్దీ వీక్షణ లు సాధిస్తూ జిల్లాకు గొప్ప గుర్తింపు తెస్తున్నాయని ప్రశంసించారు. అలాగే హెరిటేజ్ అండ్ డిజిటల్ లైబ్రరీ మిషన్ ద్వారా ప్రాచీన తాళపత్రాలు, రాజుల కాలం నాటి రాతప్రతులను డిజిటల్ రూపంలో భద్రపరుస్తున్నట్లు తెలిపా రు. అనంతరం పర్యటక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఇందులో డీఆర్డీవో రవీందర్ రాథోడ్, డీఈవో మాధవి, డీఐఈవో జాదవ్ గణేశ్, జిల్లా పర్యాటక అధికారి రవికుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


