నాలుగు కొలువులతో మెరిసిన ‘నందిని’ | - | Sakshi
Sakshi News home page

నాలుగు కొలువులతో మెరిసిన ‘నందిని’

Sep 27 2026 12:46 AM | Updated on Sep 27 2026 12:46 AM

తల్లిదండ్రులతో నందిని

ఆదిలాబాద్‌: పట్టుదలతో చదివితే సర్కారు కొలువు కష్టమేమీ కాదని నిరూపిస్తున్నారు పట్టణంలోని తిరుపల్లి కాలనీకి చెందిన జనగంవార్‌ నందిని. సంతోష్‌–సంగీత దంపతుల ఏకై క కుమార్తె ఈమె. చిన్ననాటి నుంచే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో లక్ష్యాన్ని నిర్దేశించుకుని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. క్రమశిక్షణ, నిరంతర శ్రమతో వరుసగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. తొలుత గ్రూప్‌–4లో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారు. అనంతరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జూనియర్‌ లెక్చరర్‌గా విధులు నిర్వర్తించారు. గ్రూప్‌–3లోనూ సత్తా చాటారు. గ్రూప్‌–1లోనూ ప్రతిభ కనబరిచి ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఏవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా పనిచేసిన అహ్మద్‌బాబును స్ఫూర్తిగా తీసుకున్నానని, అలాగే తల్లిదండ్రుల ప్రోత్సాహం, తన నిరంతర శ్రమతోనే ఈ విజయాలు సాధించగలిగానని నందిని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement