జైనథ్: మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయాన్ని నిర్మల్ సీనియర్ సివిల్ జడ్జి రాధిక శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. జడ్జికి ఆలయ అర్చకుడు ధీరజ్‌కుమార్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జికి అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ విశిష్టత, చరిత్ర గురించి జడ్జి అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఆలయ కమిటీ మాజీ చైర్మన్ అడ్డి రూకేశ్‌రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్, అర్చకులు వెంకటరమణాచార్యులు, ధీరజ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.


