వియత్నాం పర్యటనకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

వియత్నాం పర్యటనకు ఎంపిక

Sep 27 2026 12:28 AM | Updated on Sep 27 2026 12:28 AM

జన్నారం: విదేశీ విద్య పై అధ్యయనం చేసేందుకు వియత్నాం దేశ పర్యటనకు మండలంలోని అక్కపెల్లిగూడ పాఠశాలకు చెందిన ఉ పాధ్యాయురాలు అంకం కరుణ ఎంపికయ్యారు. గతంలో ఇదే పా ఠశాలకు చెందిన హెచ్‌ఎం జాజల శ్రీనివాస్‌ ఫిన్‌ల్యాండ్‌ దేశ పర్యటనకు వెళ్లి అక్కడి విద్యావిధానంపై అధ్యయనం చేసి వచ్చారు. వియత్నాం పర్యటనకు రాష్ట్రం నుంచి 32మంది ఎంపిక కాగా, మంచిర్యాల జిల్లా నుంచి కరుణ ఎంపిక కావడం ఆనందంగా ఉందని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి బానవత్‌ రాజేందర్‌, కాంప్లెక్స్‌ హెచ్‌ఎం విజయ్‌కుమార్‌, పీఆర్టీయూ అధ్యక్షుడు కట్ట రాజమౌళి, ప్రధాన కార్యదర్శి అనుముల రాజన్న, చైర్మన్‌ రమాదేవి, ఉపాధ్యాయులు కరుణను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement