మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని తిలక్‌నగర్‌కు చెందిన చిలుక శైలజ (32), ఆమె కూతురు విహాన్సిక (6) అదృశ్యమైనట్లు స్థానిక ఎస్సై రమేశ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తిలక్‌నగర్‌కు చెందిన దంపతులు చిలుక నాగరాజు–శైలజ మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నెల 24న నాగరాజుతో శైలజ గొడవపడి ఇంట్లోంచి కూతురుతో వెళ్లిపోయింది. శనివారం వరకు తిరిగి రాకపోవడంతో ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. శైలజ తల్లి కట్ల లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. శైలజ ఇంట్లోంచి వెళ్లినరోజు పింక్ టాప్, ఆకు పచ్చ ప్యాంట్ ధరించి ఉందని పేర్కొన్నారు. ఆచూకీ తెలిసినవారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు.


