గూడెంలో పౌర్ణమి జాతర | - | Sakshi
Sakshi News home page

గూడెంలో పౌర్ణమి జాతర

Sep 27 2026 12:28 AM | Updated on Sep 27 2026 12:28 AM

దండేపల్లి: మండలంలోని గూడెం సత్యనారా యణస్వామి ఆలయంలో శనివారం బాద్రప ద పౌర్ణమి జాతర ఘనంగా నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో వచ్చి సత్యదేవుణ్ని దర్శించుకున్నారు. 113 జంటలు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నోముకున్నారు. జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణాలు భక్తులతో రద్దీగా కనిపించాయి.

మోక్ష కర్ర గణపతి

హుండీ డబ్బుల లెక్కింపు

లోకేశ్వరం: మండలంలోని అబ్దుల్లాపూర్‌ గ్రామంలోని మోక్ష కర్ర గణపతి పదకోండు రోజు పూజలందుకున్నారు. భక్తులు మోక్ష గణపతిని దర్శించుకుని కన్నకానులు సమర్పించారు. హుండీని మోక్ష గణపతి కమిటీ సభ్యులు శనివారం లెక్కించారు. రూ. 3,30,750 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

నిర్మల్‌చైన్‌గేట్‌: జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం)కింద ఒప్పంద, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేయడానికి 37 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్‌ రాజేందర్‌ తెలిపారు. మొత్తం ఖాళీల్లో వీసీసీఎం–01, ల్యాబ్‌ టెక్నీషియన్‌–03, ఎమ్‌ఎల్‌ఎచ్‌పీ/సీహెచ్‌వో/ఎంవో (పల్లె దవాఖాన)–14, స్టాఫ్‌ నర్స్‌–05, ఏఎన్‌ఎం–06, ఫార్మసిస్ట్‌–04, సైకాలజిస్ట్‌–01, సోషల్‌ వర్కర్‌–01, అడోలెసెంట్‌ హెల్త్‌ కౌన్సిలర్‌–01, పాథాలజిస్ట్‌–01 పోస్టులు ఉన్నాయని వివరించారు. అర్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్‌, వేతనం తదితర వివరాలకు www. nirmal. telangana. gov. in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పూర్తి చేసిన దరఖాస్తుకు అవసరమైన ధ్రువపత్రాల జిరాక్స్‌ ప్రతులతో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో అక్టోబర్‌ 5వ తేదీలోగా అందించాలని తెలిపారు.

పేయింట్స్‌ షాప్‌లో చోరీ

లక్ష్మణచాంద: మండలంలోని కనకాపూర్‌ పేయింట్స్‌ షాప్‌లో చోరీ జరిగింది. శుక్రవారం రాత్రి 11.15 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కనకాపూర్‌ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న మహదేవ్‌ పేయింట్స్‌ అండ్‌ హార్డ్‌వేర్‌ షాపు షెట్టర్‌ లేపి అందులోకి చొరబడి నగదు ఎత్తుకెళ్లాడు. శనివారం ఉదయం యజమాని అనిల్‌ షాపు వద్దకు వెళ్లి చూడగా షెట్టర్‌ పైకి ఎత్తి కనిపించింది. లోపలికి వెళ్లి చూసి రూ.5వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించాడు.

సత్యదేవున్ని దర్శించుకుంటున్న భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement