పెంబి: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ అన్నారు. మండల కేంద్రంతోపాటు నాగాపూర్, మందపల్లి గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. నాగాపూర్‌లో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. మందపల్లిలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్నారు. పెంబిలో వేసవిలో షార్ట్ సర్క్యూట్‌తో దాదాపు పది ఎకరాల మొక్కజొన్న దగ్ధం కాగా.. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో బాధిత రైతులకు నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేశారు. గోస్కుల శ్రీనుకు రూ.1.08 లక్షలు, గోస్కుల తిరుమల రూ.1.44 లక్షలు, కోప్పుల జ్యోతి రూ.1.44 లక్షలు, ఎలిగేటి అనిల్‌కుమార్ రూ.2.16 లక్షలు, ఒడ్నాల ఉమకు రూ.1.44 లక్షల చెక్కులు అందజేశారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు. తహసీల్దార్ లక్ష్మణ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుడిసె రమేశ్, డీసీసీ కార్యదర్శి స్వప్నీల్‌రెడ్డి, సర్పంచులు మల్లేపల్లి సత్యనారాయణ స్వామి, బైరెడ్డి రజిత, వెంకటరాములు, నాయకులు రాజన్న, భూమేష్, మహేందర్ ఉన్నారు.
అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు కృషి
కడెం: మండలంలోని పాత తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని గ్రంథాలయానికి కేటాయించాలని చి ట్యాల్ సర్పంచ్ చీమల భీమేశ్, సామాజిక కార్యకర్త సీహెచ్.రాజేశ్ కోరారు. మండల కేంద్రంలో ఎమ్మె ల్యే వెడ్మబొజ్జుపటేల్‌ను శనివారం కలిసి విన్నవించారు. ఎమ్మెల్యే స్పందించి..గ్రంథాలయ భవనాన్ని రూ.50 లక్షలతో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్‌గా అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఏఎంసీ చైర్మన్ భూషణ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సతీశ్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.


