యువ టూరిజం క్లబ్‌లో ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

యువ టూరిజం క్లబ్‌లో ప్రతిభ

Sep 27 2026 12:28 AM | Updated on Sep 27 2026 12:28 AM

నిర్మల్‌ రూరల్‌: యువ టూరిజం క్లబ్‌లో జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ప్రతిభ కనబరిచి బహుమతులు గెలుచుకున్నారు. శనివారం హైదరాబాద్‌లో కళాశాలల విభాగంలో నిర్వహించిన నృత్య పోటీల్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల విద్యార్థినులు ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. ద్వితీయ సంవత్సరం బీపీసీ విభాగానికి చెందిన ఎం.యోగిత, ఆర్‌.పూజ, హెచ్‌ఈసీ విభాగానికి చెందిన జె.గంగోత్రి, చాకోల, ఎంపీసీ విభాగానికి చెందిన వైభవలక్ష్మి, సీఈసీ విభాగానికి చెందిన సమీత, దుర్గాదేవి, ఎంపీహెచ్‌డబ్ల్యూ విభాగానికి చెందిన ఎ.వైష్ణవి ప్రతిభ చాటి ఈ విజయం సాధించారు. పాఠశాలల విభాగంలో ఖానాపూర్‌ మండలం పాత ఎల్లాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థినులు నృత్య విభాగంలో రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానంలో రాణించి ప్రశంసనీయమైన ప్రదర్శన ఇచ్చి కన్సోలేషన్‌ బహుమతి సాధించారు. ఈ విభాగంలో ఎం.వరలక్ష్మి, ఆర్‌.శృతి, ఎం.రక్షిత, ఎ.సంజన, ఎం.రమ్య, కె.మనోజ్ఞ, కె.అనన్య, ఎం.వైష్ణవి విజేతలుగా నిలిచారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటి జిల్లాకు మంచి పేరు తెచ్చిన విద్యార్థినులను డీఈవో భోజన్న, అధ్యాపకులు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement