నార్నూర్: పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి 108 సిబ్బంది సకాలంలో స్పందించి ఇంటివద్దే పురుడుపోశారు. వివరాలు.. కొలామకు చెందిన పెందోర్ మోతుబాయికి శనివారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. దీంతో 108 సిబ్బంది అంబులెన్స్‌తో గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే మోతుబాయికి నొప్పులు తీవ్రం కావడంతో ఆస్పత్రికి తరలించే పరిస్థితి లేక 108 సిబ్బంది ఇంటివద్దే పురుడుపోశారు. మోతుబాయి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. అనంతరం వారిని గాదిగూడ పీహెచ్‌సీకి తరలించారు. ఈ సందర్భంగా 108 సిబ్బందికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈఎంఆర్పీ డాక్టర్ వినయ్ సూచనల మేరకు తల్లీబిడ్డకు వైద్య సేవలు అందించారు. సేవల్లో పైలట్ సచిన్ రాథోడ్, ఈఎంటీ ప్రదీప్‌కుమార్, ఆశ కార్యకర్త జుగ్నాక రషిక పాల్గొన్నారు.


