నేరాల నియంత్రణకు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణకు సహకరించాలి

Aug 28 2026 1:39 AM | Updated on Aug 28 2026 1:39 AM

● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ● దాబా(బి)లో వైద్యశిబిరం

ఇచ్చోడ: నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకే ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలి పారు. మండలంలోని దాబా(బి) గ్రామంలో గురువారం పోలీసులు మీకోసం కార్యక్రమంతోపా టు వైద్యశిబిరం నిర్వహించారు. ముందుగా ఎస్పీకి గ్రా మస్తులు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆంజనేయస్వామి ఆలయంలో ఎస్పీ ప్రత్యేక పూజలు చేశారు. 10 మందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. ప్రజా సమస్య లను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నివారణపై స్కిట్‌ ప్రదర్శించి అవగాహన కల్పించారు. వైద్యశిబిరంలో మహిళలు, బాలికలకు పీసీవోడీ, రక్తహీనత తదితర సమస్యలపై వైద్యులు అవగాహన కల్పించి డెంగీ, మలేరియా నివారణ చర్యలను వివరించారు. కంటి సమస్యలతో బాధపడేవారికి అవసరమైన సందర్భాల్లో ఉచిత కంటి శస్త్రచికిత్స సేవలందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌కు రాఖీ కట్టి రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

మాదాపూర్‌లో సీసీ కెమెరాలు ప్రారంభం

ఇచ్చోడ మండలంలోని మాదాపూర్‌లో గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన 13 సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీజీ, అంబేడ్కర్‌ చిత్రపటాలకు ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఉట్నూర్‌ ఏఎస్పీ రుత్విక్‌ సాయి, ఇచ్చోడ ఎస్‌హెచ్‌వో నరేశ్‌కుమార్‌, సర్పంచులు షేక్‌ ఇమ్రాన్‌, ఈశ్వర్‌, పోలీస్‌ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement