ఇంద్రవెల్లి మండలంలోని ఇంద్రవెల్లి, హర్కపూర్‌తండా, మచ్చపూర్, బిక్కుతండా, లాల్‌టేడికి గ్రామాల్లోని లంబాడీ తండాల్లో గురువారం తీజ్ వేడుకలు ప్రారంభించారు. పెళ్లి కాని యువతులు, చిన్నారులు గ్రామ పొలిమేరల్లోని పంటచేన్ల వద్ద పుట్ట మట్టి సేకరించారు. యువతులు సంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. అనంతరం సేకరించిన పుట్టమట్టిని గ్రామపెద్దల ఇళ్లకు తెచ్చారు. వెదురు బుట్టల్లో మట్టివేసి గోధుమ విత్తనాలు నాటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు గోధుమ నారుకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీజ్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు లంబాడీతండా పెద్దలు తెలిపారు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. – ఇంద్రవెల్లి


