లక్ష్మణచాంద: సోదరులకు రాఖీ కట్టేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తమ రెండు నెలల కుమారుడిని కోల్పోయిన విషాధకర సంఘటన మండలంలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దస్తురాబాద్‌కు చెందిన జాజిమొగ్గ శిరీష పార్‌పెల్లి లో ఉన్న తన సోదరులకు రాఖీ కట్టేందుకు గురువా రం తన ఇద్దరు కుమారులు ప్రన్షు (4), చింటూ (2 నెలలు)తో కలిసి ఖానాపూర్ వరకు ఆర్టీసీ బస్సులో వచ్చింది. అక్కడ ఆటో ఎక్కి వెళ్తుండగా లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్ వచ్చే క్రమంలో జాతీయ రహదారి 61 బాబాపూర్ ఎక్స్ రోడ్డుపై డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఆటో అదుపు తప్పడంతో పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. గ మనించిన వాహనదారులు ప్రయాణికులను బయటకు తీసి 108లో నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆటోలో మొత్తం 8 మంది ప్రయాణికులు ఉండగా ఇందులో ఏడుగురికి స్వ ల్పగాయాలయ్యాయి. చింటూకు చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ రషీద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణి తెలిపారు.


