కై లాస్‌నగర్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ఈనెల 27న గ్రామ, వార్డు సభలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయ న పాల్గొన్నారు. అనంతరం అధికారులతో స మీక్షించారు. పంచాయతీ కార్యదర్శులు, బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లు ఈ ప్రక్రియను సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించా రు. గ్రామ, వార్డుసభల్లో ముసాయిదా ఓటరు జాబితా, ఏఎస్‌డీ జాబితాలను తప్పకుండా చదివి వినిపించాలన్నారు. డెత్ కేసులు, షిఫ్టెడ్, డబుల్ ఎంట్రీలు ఏమైనా ఉంటే వాటిని వెంటనే ఏఎస్‌డీ జాబితాలో చేర్చాలని, పొరపాటు న ఏఎస్‌డీ జాబితాలో వస్తే ఫారం–6 ద్వారా సరిచేయాలని చెప్పారు. పంచాయతీ కార్యదర్శి, జీపీవో, బీఎల్‌వో, సూపర్‌వైజర్లు సమన్వయంతో పని చేసి ఓటర్ల జాబితా ప్రక్షాళనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వీ డియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌వో స్రవంతి, ఆర్డీవో జగదీశ్వర్ రావు, పర్యవేక్షకురాలు నలంద ప్రి య, తహసీల్దార్లు, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
‘నీట్ పీజీ–2026’కు పకడ్బందీ ఏర్పాట్లు
కై లాస్‌నగర్: ఈ నెల 30న నిర్వహించనున్న నీట్ పీజీ– 2026కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పరీక్ష ని ర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. నలంద డిగ్రీ, పీజీ కళాశాలలో నిర్వహించనున్న పరీక్ష కు 100మంది హాజరుకానున్నట్లుగా తెలిపా రు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 7 నుంచి 8:30 గంటల వరకు అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించనున్నట్లు తెలిపారు. స మావేశంలో అదనపు కలెక్టర్లు చిత్రు, ఎస్.రాజేశ్వర్, డీఎంహెచ్‌వో సాధన, డీఐఈవో గణేశ్‌జాదవ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, పర్యవేక్షకురాలు శైలజ తదితరులు పాల్గొన్నారు.


