గతంలో పలుమార్లు ఫిర్యాదు చేశాం.. | - | Sakshi
Sakshi News home page

గతంలో పలుమార్లు ఫిర్యాదు చేశాం..

Aug 22 2026 1:59 AM | Updated on Aug 22 2026 1:59 AM

జిల్లాలో నిబంధనలను విరుద్ధంగా అనేక పాఠశాలల్లో యూనిఫాం, బుక్స్‌, ఇతర వస్తువులు విక్రయిస్తున్నారు. గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. యాజమాన్యాలు రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. చాలా పాఠశాలల్లో కనీస వసతులు లేవు. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం వాటిపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక పోర్టల్‌ ఏర్పాటు చేయడం మంచి పరిణామం.

– రాహుల్‌, టీవీవీ జిల్లా అధ్యక్షుడు

ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం

ప్రభుత్వం ప్రైవేట్‌ పాఠశాలలపై ఫిర్యాదు కోసం పోర్టల్‌ను ఏర్పాటు చేయడం హర్షణీయం. నిబంధనలు అతిక్రమించే స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా అధికారులు సత్వరం తనిఖీలు చేపట్టాలి.

– గొడం కేశవ్‌,

ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement