నేరడిగొండ: మండల పరిధిలోని కొర్టికల్(బి) మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల గురువారం తెరుచుకోకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎ దుర్కొన్నారు. ఈ పాఠశాలలో 22 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే, స్కూల్ కాంప్లె క్స్ సమావేశానికి పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు వెళ్లిపోయారు. దీంతో పాఠశాల తెరుచుకోకపోవడంతో విద్యార్థులు ఆవరణ లోనే ఆడుకుంటూ గడిపారు. కాంప్లెక్స్ సమావేశాలు ఉన్నప్పుడు కనీసం ఒక ఉపాధ్యాయుడినైనా పా ఠశాలలో అందుబాటులో ఉంచకుండా, ఇద్దరూ వె ళ్లిపోవడంపై స్థానికులు, తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు వివేకానందను వివరణ కోరగా.. గురువారం కాంప్లెక్స్ సమావేశం నిర్వహించడంతో ఉపాధ్యాయులు హాజరయ్యారని, మధ్యాహ్నం నుంచి పాఠశాల వద్ద ఉపాధ్యాయులు ఎవరూ అందుబాటులో లేరని తెలిపారు.


