బెల్లంపల్లి: అతివేగం అజాగ్రత్త ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఈ విషాద ఘటన బెల్లంపల్లి శివారులోని కన్నాల జంక్షన్ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వన్‌టౌన్ ఎస్‌హెచ్‌ఓ కె.శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు మందమర్రి ఏరియా శాంతిఖని గనిలో జనరల్ అసిస్టెంట్ కార్మికుడిగా పనిచేస్తున్న ఎడమనూరి సురేష్ (39) బెల్లంపల్లి స్టేషన్‌రోడ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. బుధవారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో తన స్నేహితుడు గట్లే చిరంజీవితో కలిసి పల్సర్ బైక్‌పై కన్నాల నుంచి రోడ్‌క్రాస్ చేసి బెల్లంపల్లి వైపు వస్తుండగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన నుంచి హైదరాబాద్‌కు అతివేగంగా వచ్చిన బొలెరో ఢీ కొట్టింది. దీంతో బైక్ కొన్ని మీటర్ల దూరంలో పడిపోయింది. ఘటనలో సురేష్ అక్కడికక్కడే మృతి చెందగా చిరంజీవికి తీవ్రగాయాలయ్యాయి. విష యం తెలుసుకున్న చిరంజీవి కుటుంబసభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెబ్బెనకు చెందిన బొలెరో డ్రైవర్ మోర్లే మహేందర్ వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి పరారయ్యాడు.
బిడ్డను చూడకుండానే...
మృతుడు సురేష్ భార్య సుష్మ ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. ఆరేళ్ల క్రితం తండ్రి కొమురయ్య వారసత్వంగా వచ్చిన సింగరేణి ఉద్యోగం చేస్తున్నాడు. తొ లుచూరు బిడ్డను తనివితీరా ముద్దాడాలని తపన ప డిన ఆ తండ్రి ఆ అదృష్టానికి నోచుకోకుండానే అ ర్థంతరంగా రోడ్డు ప్రమాదం రూపంలో తిరిగి రాని లోకానికి వెళ్లిపోయాడు. జీవితాంతం తోడుంటాన ని మూడుముళ్లు.. ఏడడుగులు నడిచిన భర్త కానరాకుండా పోవడంతో ఆమె దుఖించిన తీరు అందరిని కలిచి వేసింది. మృతుని తండ్రి ఎడమనూరి కొమురయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాసరావు తెలిపారు.


