పాతమంచిర్యాల: ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఆటో జేఎసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ ఆటో జేఎసీ(అన్నిసంఘాల) రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గాజుల ముఖేష్‌గౌడ్ అన్నా రు. గురువారం హైదరాబాద్‌లో అన్ని రాజ కీయ పార్టీల నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 24న అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఆటో కార్మికులు రోడ్ల దిగ్భందం చేపట్టి ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలిస్తే సరి.. లేదంటే చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.
పాదయాత్రగా వెళ్లి..
అధినేతను కలిసి..
వాంకిడి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మ ళ్లీ కేసీఆర్ రావాలని కోరుతూ వాంకిడికి చెంది న జాడి తిరుపతి, శంకర్ ఈ నెల 10న మండల కేంద్రం నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి పాదయాత్ర చేపట్టారు. 274 కిలోమీటర్లు కా లినడక సాగించి గురువారం బీఆర్‌ఎస్ అధి నే త, మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. సుమా రు 30 నిమిషాలు వాంకిడి, ఆసిఫాబాద్ విషయాలపై చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారిని శాలువాలతో సత్కరించి తన ఇన్నోవా వాహనంలో ఇంటికి పంపించారు.


