కైలాస్‌నగర్: అధికారం లేదనే అక్కసుతోనే ప్రజా సంక్షేమ పథకాలపై మాజీ మంత్రి జోగు రామన్న దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాల విషయంలో హైకోర్టు ఇచ్చి నవి కేవలం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమేనని, అంతిమ తీర్పుకాదనే విషయాన్ని వారు గ్రహించా లన్నారు. 2014 నుంచి 2023 వరకు పదేళ్ల పా టు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం, జీవోలద్వారా అమలుచేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలకు చట్టభద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కోర్టులో అఫిడవిట్ దాఖలులో అలసత్వం వహించిన అధికారులపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే స్పందించారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినట్లుగా పేర్కొన్నారు. ఇందులో నాయకులు పాల్గొన్నారు.


