కై లాస్‌నగర్/ఇచ్చోడ: పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిలిపి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ మంగళవారం ఆందోళన చేపట్టింది. మాజీ మంత్రి రామన్న ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట, ఇచ్చోడలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నేతృత్వంలో ధర్నా చేపట్టారు. జిల్లాకేంద్రంలో పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. రహదారిపై గంట పాటు బైఠాయించారు. ఆర్డీవో కార్యాలయ ఏవో వారి వద్దకు వచ్చి వినతిపత్రం స్వీకరించగా ఆందో ళన విరమించారు. ఈ సందర్భంగా రామన్న మా ట్లాడుతూ, పేదింటి ఆడబిడ్డల వివాహానికి ఆర్థిక భరోసా కల్పించేలా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిలిపివేయడం విచారకరమన్నారు. కార్యక్రమంలో నాయకులు అజయ్, నారాయణ, సాజిదొద్దీన్, యూనిస్ అక్బాని, స్వరూపరాణి, మమత, రమేష్, జగదీష్, ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడారు. పేదింటి ఆడబిడ్డల సంక్షేమ పథకాలను రద్దు చేసేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న ్చ తగిన బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో బోథ్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, బీఆర్‌ఎస్ నాయకులు ఏనుగు కృష్ణారెడ్డి, గాడ్గె సుభాష్, పాండుతో పాటు మాజీ జెడ్పీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


