ఇచ్చోడ: ‘నో ఎంట్రీ.. గేటు నుంచే మాట్లాడాలి’ శీర్షికన ఈ నెల 16న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం నేపథ్యంలో ఐటీడీవో పీవో మంద మకరందు మంగళవారం సాయంత్రం కుంటాల బాలికల ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. నేరుగా తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, సిబ్బందితో మాట్లాడారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఇచ్చోడ ఏటీడీవో సుచేతన్‌రెడ్డి ఉన్నారు.


