10వ రోజుకు ‘సీసీఐ’ దీక్ష | - | Sakshi
Sakshi News home page

10వ రోజుకు ‘సీసీఐ’ దీక్ష

Aug 19 2026 1:06 AM | Updated on Aug 19 2026 1:06 AM

ఆదిలాబాద్‌టౌన్‌: సీసీఐ పునఃప్రారంభించాలని డి మాండ్‌ చేస్తూ సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు కానసాగుతున్నాయి. మంగళవా రం నాటికి పదోరోజుకు చేరాయి. దీక్షలో సీపీఎం, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు సుమారు 25 మంది కూర్చున్నారు. సీపీఎం సీనియర్‌ నాయకుడు లంకా రాఘవులు మాట్లాడుతూ, సీసీఐని పునఃప్రారంభిస్తే ఈ ప్రాంతం పారిశ్రామికాభివృద్ధి తోపాటు వేలాదిమంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. దీక్షలో మంజుల, గంగసాగర్‌, ఆరిఫా బేగం, స్వామి, సునీత కూర్చున్నారు. వీరికి సాధన కమిటీ కన్వీనర్‌ మల్లేశ్‌, కోకన్వీనర్‌ నారాయణ, రమేశ్‌, పోశెట్టి, రంగన్న, ఈశ్వర్‌, అశోక్‌ స్వామి మద్దతు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement