మేకల దొంగలు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

మేకల దొంగలు అరెస్ట్‌

Aug 18 2026 12:21 AM | Updated on Aug 18 2026 12:21 AM

ఆదిలాబాద్‌టౌన్‌: పట్టణంలోని జైజవాన్‌నగర్‌లో మేకల చోరీకి పాల్పడిన నలుగురిని అరెస్టు చేసినట్లు టూటౌన్‌ సీఐ నాగరాజు తెలిపారు. సోమవారం టూటౌన్‌లో వివరాలు వెల్లడించారు. ఈనెల 16న జైజవాన్‌నగర్‌కు చెందిన కోహినూర్‌ బేగం తన మేకలు కనిపించడం లేదని డయల్‌ 100 ద్వారా టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సైలు అఖిల్‌, ప్రణయ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీటీవీ పుటేజీల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మహమ్మద్‌ పర్వేజ్‌, షేక్‌ ఐజాన్‌ మేకలను చోరీ చేసి మహమ్మద్‌ ఫిర్దోస్‌, ఆసిఫ్‌ఖాన్‌కు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. చోరీకి గురైన ఐదు మేకలతో పాటు కారు, మూడు సెల్‌ఫోన్లు, రూ.2వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement