● మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే అనిల్
బోథ్: మాటకు కట్టుబడి ఒక్కరోజులోనే గ్రా మానికి ఆర్టీసీ బస్సు వచ్చేలా చొరవ చూపారు ఎమ్మెల్యే అనిల్ జాదవ్. బోథ్ మండలంలోని కన్గుట్ట గ్రామంలో గురువారం నిర్వహించిన అఖండ జ్యోతి కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజ రయ్యారు. ఆ సమయంలో ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన రేపటి నుంచే గ్రామానికి బస్సు నడిచేలా చూ స్తానని హామీ ఇచ్చారు. మాట ప్రకారం ఆర్టీసీ అధికా రులతో వెంటనే మాట్లాడారు. ఒక్కరోజులోనే సర్వీసు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టా రు. 15 ఏళ్ల తరువాత గ్రామానికి శుక్రవారం ఉదయం బస్సు రావడంతో గ్రామస్తులు హ ర్షం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలి పారు. ఇందులో గంగమల్లు, భోజారెడ్డి, రమణ, రాజు, రవీందర్, రాములు, రామకృష్ణ, స్వామి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


