న్యూస్‌రీల్
● పలుచోట్ల పొంగిన వాగులు, వంకలు
‘పుర’ కౌన్సిలర్లకు శిక్షణ
కై లాస్‌నగర్: ఇటీవల నూతనంగా ఎన్నికై న మున్సిపల్ కౌన్సిలర్లకు పురపాలనపై మంగళవారం రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని సెంచనరీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన శిక్షణకు ఆదిలాబాద్‌కు చెందిన పలువురు కౌన్సిలర్లు హాజరయ్యారు. 2019 మున్సిపల్ యాక్ట్‌తో పాటు విధులు, బాధ్యతలు, అమృత్ 2.0, స్వ చ్ఛభారత్ మిషన్ కార్యక్రమాల అమలు, యూ ఐడీఎఫ్ నిధుల వినియోగం వంటి అంశాలపై రెండు సెషన్లుగా శిక్షణ ఇచ్చారు. ప్రత్యేక సామగ్రితో కూడిన బ్యాగులను సైతం అందజేశారు.
జోరువాన
ఆదిలాబాద్‌టౌన్/ఉట్నూర్‌రూరల్:ఎట్టకేలకు జి ల్లాలో విస్తారంగా వర్షం కురిసింది.ఇటీవల కురి సిన వాన పంటలకు జీవం పోయగా, ప్ర స్తుతం కురుస్తున్న వర్షాలతో రైతులు హర్షం వ్యక్తం చే స్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సా ధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈక్రమంలో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు కురిసిన జోరువానతో పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఈ సీ జన్‌లో ఇదే భారీ వర్షంగా నమోదైంది. మోస్తరు నుంచి సాధారణ వర్షం నమోదైంది. జిల్లాలో ఎనిమిది మండలాల్లో అత్యధిక, మిగతా మండలాల్లో సాధారణ వర్షం కురిసింది. ఇచ్చోడలో అత్యధికంగా 36 మి.మీ.లు, తాంసిలో 34.8, ఇంద్రవెల్లి, తలమడుగులో 27, గుడిహత్నూర్‌లో 24.5, భోరజ్‌లో 19, జైనథ్‌లో 16.3, మావలలో 16మి.మీ.ల వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో బజార్‌హత్నూర్‌లో 14.8, ఆది లాబాద్ పట్టణంలో 12.3, బోథ్‌లో 9.8, నా ర్నూర్‌లో 7.8, నేరడిగొండ, బేలలో 7, సొనాలలో 5.8, అత్యల్పంగా గాదిగూడ లోకారి(కె), బేలలోని చెప్రాలలో 4 మి.మీ.ల నమోదైంది.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఆధ్వర్యంలో సివిల్ ఏవియేషన్ ఎన్‌క్లేవ్ ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించనుండగా, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రంతో పాటు ఎంఆర్‌వో ఇతరత్రా సదుపాయాలతో ఏర్పాటు కానుంది. ఇందుకోసం తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 2009 ఎకరాల భూసేకరణకు గాను రూ.2278 కోట్ల నిధుల మంజూరు చేస్తూ ఈనెల 25న జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. భూసేకరణతో పాటు ప్రతిపాదిత ప్రాజెక్ట్ నిర్మాణంలో అడ్డంకులు తొలగించేందుకు వివిధ పనుల కోసం ఈ నిధులు వెచ్చింనున్నారు.
ప్రైవేట్ అకాడమీల దృష్టి..
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టుతో పాటు వైమానిక శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుండగా ఇక్కడ ప్రైవేట్ అకాడమీలు కూడా శిక్షణకు ముందుకు వస్తున్నాయి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వివిధ ప్రైవేట్ అకాడమీలను సంప్రదించగా వారు ఈ ప్రాంతంలో ఏర్పాటుకు ఆసక్తి కనబర్చుతూ తమ దరఖాస్తులు అందజేశారు. తాజాగా ఎమ్మెల్యే ద్వారా వాటిని కేంద్ర రక్షణ శాఖకు అందజేశారు.
అకాడమీలు ఇలా..
పైలెట్ శిక్షణ ఆసక్తి కనబర్చే వారికి విమానం నడపడం నేర్పిస్తారు. దాంతో పాటు పైలట్ లైసెన్సులు, రేటింగ్‌ల కోసం శిక్షణ ఇవ్వడానికి విమానయాన అధికార సంస్థ (డీజీసీఏ, ఈఏఎస్‌ఏ) నుంచి అధికారిక ఆమోదం పొంది ఉండాలి. అలాంటి సంస్థలే శిక్షణ ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎయిర్‌పోర్టుతో పాటు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన శిక్షణ కేంద్రం ఏర్పాటు కానున్నాయి. ఈ క్రమంలో ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీలు కూడా ఈ ప్రాంతంపై దృష్టి సారించాయి. ప్రైవేట్ పైలట్ శిక్షణ సంస్థలు రెండు ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబర్చుతున్నాయి. అలాగే ఆరు ఎంఆర్‌ఓ (నిర్వహణ), రిపేర్ (మరమ్మతు), ఓవర్‌హాల్ (సమగ్ర తనిఖీ) కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సుముఖుత వ్యక్తం చేస్తున్నాయి. ఈ దిశగా అడుగులు పడ్డాయి. కేంద్ర రక్షణ శాఖకు దరఖాస్తు చేసుకున్నాయి. – సాక్షి, ఆదిలాబాద్
పంటలకు ఊపిరి..
ఎల్‌నినో కారణంగా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఉంటాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సరైన వానలు లేకపోవడంతో రైతులు వేసిన పంటలు వాడిపోయినట్లు కనిపించాయి. అయితే వారం క్రితం కురిసిన వర్షంతో కొంత జీవం పోసినట్లయింది. ్చప్రస్తుతం భారీ వర్షం నమోదు కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పత్తి, సోయా, కందితో పాటు ఇతర పంటలకు మేలు చేకూరినట్లే. మరో వారం పది రోజుల వరకు వర్షం కురువకపోయినా పర్వా లేదన్నట్టుగా ఉందని రైతులు చెబుతున్నారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఇంకా చెరువులు, కుంటలు నిండలేదు. మరో రెండు మూడు భారీ వర్షాలు కురిస్తే జలాశయాలు నీటితో కళకళలాడనున్నాయి. కాగా ఉట్నూర్ మండలంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. నర్సాపూర్(జి) వాగు పొంగడంతో రాకపోకలకు కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. వాగు దాటడానికి విద్యార్థులు అవస్థలు పడ్డారు. ఏటా వర్షాకాలంలో తమకు వాగు తిప్పలు తప్పడం లేదని సర్పంచ్ జుగాదిరావు పేర్కొన్నారు. శాశ్వత వంతెన నిర్మించాలని కోరారు. మరోవైపు జిల్లా కేంద్రంతో పాటు పలు లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి.
విద్యార్థుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థుల సమస్యల పరి ష్కారమే తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీ పీ) లక్ష్యమని సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లా అధ్యక్షుడు కొట్టూరి ప్రవీణ్‌కుమార్ అన్నా రు. 14వ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్‌ను జిల్లా కేంద్రంలో మంగళవారం ఆవిష్కరించారు. తె లంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన టీజీ వీపీ విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పో రాడుతూ ప్రశ్నించే గొంతుకగా గుర్తింపు పొందిందన్నారు. కార్యక్రమానికి డీఐఈవో జాదవ్‌గణేశ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా ఆదిలాబాద్ నియోజకవర్గ కన్వీనర్ సతీశ్, బోథ్, నిర్మల్ నియోజకవర్గ కన్వీనర్ గణేశ్, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎంఆర్‌ఓ కేంద్రాలు..
1. జెట్ సెట్ గో
2. డెక్కన్
3. గోల్డన్ ఈగల్ ఏవియేషన్
4. స్టార్ ఎయిర్
5. యథి ఏవియేషన్
6. థంబై ఏవియేషన్
ఎంఆర్‌ఓ కేంద్రాలు..
1. జెట్ సెట్ గో
2. డెక్కన్
3. గోల్డెన్ ఈగల్ ఏవియేషన్
4. స్టార్ ఎయిర్
5. యథి ఏవియేషన్
6. థంబై ఏవియేషన్
దరఖాస్తు చేసుకున్న సంస్థలు..
ఎఫ్‌టీవో (పైలట్ శిక్షణ సంస్థలు)
2. వింగ్ ఏవియేషన్ అకాడమీ
1. ప్లైటెక్ ఏవియేషన్ అకాడమీ


