కై లాస్‌నగర్: జిల్లాలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో పాఠశాలల అకాడమిక్ పురోగతి, ప్రవేశాలు, పరీక్షల ఫలితాలు, భోజన నాణ్యత, మౌలిక సదుపాయాలపై సమీక్షించారు. ప్రిన్సిపాళ్లు వివరించిన సమస్యలను పరిశీలించిన కలెక్టర్ వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రతి వారం డీఎండబ్ల్యూ, ఆర్‌ఎల్‌సీ, విజిలెన్స్, అకడమిక్ కోఆర్డినేటర్‌లతో కూడిన సంయుక్త బృందం ఒక పాఠశాలను తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, ఆర్‌ఎస్ చిత్రు, డీపీవో రమేశ్, మైనారిటీ సంక్షేమ అధికారి కలీం, డీఎంహెచ్‌వో సాధన, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ మైనారిటీ గురుకులాలు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు, ఆర్‌ఎల్‌సీ, విజిలెన్స్, డీఎండబ్ల్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


