ఉట్నూర్‌రూరల్: రైతులు సాగులో రసాయన ఎరువులు తగ్గించి, ప్రయోజనకరమైన ప్రకృతి సేద్యం వైపు మొగ్గు చూపాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరా వు వర్చువల్‌గా మంగళవారం నిర్వహించిన రైతునేస్తం 100వ ఎపిసోడ్ వీడియో కాన్ఫరెన్స్ ఉట్నూర్‌లోని రైతు వేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హాజరయ్యా రు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, రసాయన ఎరువులు ఇష్టానుసారం వాడితే భూసారం తగ్గడంతో పాటు దిగుబ డిపై ప్రభావం చూపుతుందన్నారు. ప్రకృతి సేద్యం చేసే రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుందని పేర్కొన్నారు. భూగర్భ జలాలను పెంచేందుకు ఫాంపాండ్లు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకో వాలన్నారు. జిల్లాకు మరో 1,350 మెట్రిక్ టన్నుల డీఏపీ రానుందని, పట్టా లేని రైతులు కూడా యాప్ ద్వారా ఎరువులు పొందే అవకాశం కల్పించామని పేర్కొన్నా రు. ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడుతూ.. శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ పంటలు సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయన్నారు. అనంతరం విధుల్లో ప్రతిభ కనబరిచిన వ్యవసాయ అధికారులు, ఆదర్శ రైతులకు మెమెంటోలు అందజేసి అభినందించా రు. రైతువేదికలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో ఆర్డీవో మోహన్‌సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్, తహసీల్దార్ రఘునాథ్, ఎంపీడీవో రైసుద్దీన్, ఏడీఏలు శ్రీధర్, రాంకిషన్, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్‌లు అనిత, రేణుక, మండల వ్యవసాయ, విస్తరణ, ఉద్యాన, ఇతర శా ఖల అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


