కొత్త పింఛన్లపై ఆశలు | - | Sakshi
Sakshi News home page

కొత్త పింఛన్లపై ఆశలు

Jul 29 2026 12:40 AM | Updated on Jul 29 2026 12:40 AM

జిల్లాలో 3,343 దరఖాస్తులు పెండింగ్‌ ఐదేళ్లుగా నిలిచిన ఆన్‌లైన్‌ ప్రక్రియ అర్హుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం పంద్రాగస్టు కానుకగా మంజూరయ్యే అవకాశం

కై లాస్‌నగర్‌: చేయూత పింఛన్‌ కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం తీపికబురు అందించింది. పంద్రాగస్టు కానుకగా వచ్చే నెల 15నుంచి కొత్తవి మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీ ణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క చేసిన ప్రకటనతో అర్హులైన వారి లో కొత్త ఆశలు చిగురిస్తున్నా యి. ఐదేళ్లుగా మంజూరు లేక ద రఖాస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియ నిలి చిపోయింది. అంతకుముందు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించినా రాష్ట్రస్థాయిలో పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. కొత్తవి మంజూరైతే వీరికి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. తొలుత ఒంటరి మహిళలు, వితంతువులకే ప్రా ధాన్యత ఉంటుందని ప్రకటించడంతో ఇతర కేట గిరీల వారిలో కొంత నిరాశ వ్యక్తమవుతుంది. ప్రభుత్వం మళ్లీ దరఖాస్తులు స్వీకరించినట్‌లైతే లబ్ధిదా రుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం లేకపోలేదు.

జిల్లాలో ఇలా..

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయం నుంచే కొత్త పింఛన్ల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. 2019–20లో అర్హులైన వారి నుంచి అప్పటి సర్కారు దరఖాస్తులు స్వీకరించి మంజూరు చేసింది. వృద్ధాప్య పింఛన్‌ వయస్సును 2021 సంవత్సరంలో 60 నుంచి 57 ఏళ్లకు తగ్గించి మంజూరు చేసింది. ఇతర కేటగిరీలకు మాత్రం 2020 నుంచే నిలిచిపోయింది. ఆ సమయంలో దరఖాస్తు చేసుకున్న 3,343 మంది ఇప్పటికీ ఎదురుచూస్తునే ఉన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త పింఛన్‌ అందిస్తామని ప్రకటిస్తున్నప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు. తాజా నిర్ణయంతో వారికి లబ్ధి చేకూరే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. అయితే తొలి ప్రాధాన్యతగా ఒంటరి మహిళలు, వితంతువులకే మంజూరు చేస్తామని ప్రభుత్వం పేర్కొంటుండడంతో జిల్లాలో 2246 మందికి మాత్రమే పింఛన్లు అందే అవకాశముంటుంది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకే ప్రభుత్వం పింఛన్‌ మంజూరు చేస్తుందా లేక అర్హులైన వారి నుంచి కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తుందా అనేదాని పై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. మరోవైపు ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావా ణితో పాటు ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ప్ర జాపాలనలోనూ దరఖాస్తులు అందజేస్తూనే ఉన్నా రు. ప్రజాప్రతినిధులను సైతం కలుస్తూ తమకు పింఛన్‌ మంజూరు చేయాలని వేడుకుంటున్నారు.

ప్రభుత్వ ఆదేశానుసారం చర్యలు

పంద్రాగస్టు నుంచి కొత్త పింఛన్లు అందిస్తామని ప్రభుత్వం చెబుతుంది. అయితే దీనిపై అధికారికంగా ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం లేదు. గతంలో క్షేత్రస్థాయిలో గుర్తించిన అర్హులకు మంజూరు చేస్తుందా లేక దరఖాస్తులను కొత్తగా స్వీకరిస్తారా అనేదానిపై స్పష్టత లేదు. ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకుంటాం.

– గోవింద్‌రావు, అదనపు డీఆర్‌డీఓ

జిల్లాలో కేటగిరీల వారీగా

పెండింగ్‌ దరఖాస్తుల వివరాలు

కేటగిరీ దరఖాస్తులు

వృద్ధాప్య 549

ఒంటరి 82

వితంతు 2164

దివ్యాంగ 372

గీత 2

చేనేత 1

హెచ్‌ఐవీ 103

ఫైలేరియా 51

డయాలసిస్‌ 7

బీడీ కార్మికులు 12

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement