ఆదిలాబాద్‌టౌన్: ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజ కీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రెండు చోట్ల ఓటు హక్కు నమోదైన వారు వెంటనే ఒకే ప్రాంతంలో ఓటు కొనసాగించేలా నిర్ణ యం తీసుకుని, మరో ప్రాంతంలోని ఓటును తొలగించేందుకు ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్‌ఓలకు అందజేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీ కరణలో భాగంగా 2025 ఓటరు జాబితా ప్రకారం 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న కేంద్రాలను మాత్రమే పునర్వ్యవస్థీకరించే ప్రతిపాదన ఉందన్నా రు. అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, ఆర్డీవో జగదీశ్వరరావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలందప్రియ, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థికి కలెక్టర్ అభినందన
ఆదిలాబాద్‌టౌన్: జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం (జేఎన్‌టీయూ)లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సైబర్ సెక్యూరిటీ) విభాగంలో సీటు సాధించిన విద్యార్థి కొత్తపల్లి హరివర్ధన్‌ను కలెక్టర్ రాజర్షిషా గురువారం అభినందించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న కొత్తపల్లి ఆశన్న కుమారుడు ప్రతిష్ఠాత్మకమైన కోర్సులో సీటు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు.
డేటా ఆధారిత పాలనతోనే సమర్థవంతమైన సేవలు
ఆదిలాబాద్‌టౌన్: సాంకేతిక పరిజ్ఞానం, ఖచ్చితమైన డేటా విశ్లేషణ, పారదర్శక విధానాల అమలుతో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించవచ్చని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ నీతి ఆయో గ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ‘నీతి–తార’ సామర్థ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం ముగింపు సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ శాఖల అధికారులు డిజిటల్ సాంకేతిక సాధనాలను సమర్థవంతంగా వినియోగిస్తూ క్షేత్రస్థాయిలో సమస్యలను శాసీ్త్రయంగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ రవీందర్ రాథోడ్, నీతి ఆయోగ్ ప్రోగ్రామ్ అధికారి రాహుల్, బ్లాక్ అధికారుల మాస్టర్ ట్రైనర్ నర్సింగ్ దాస్, తదితరులు పాల్గొన్నారు.


