సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి కృషి

Jul 24 2026 1:45 AM | Updated on Jul 24 2026 1:45 AM

● ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌

ఆదిలాబాద్‌: పట్టణంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ తెలిపారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని దుర్గానగర్‌ కాలనీలో పర్యటించి మురికి కాలువలు, రోడ్లు, ఇళ్ల పరిస్థితిని పరిశీలించారు. కాలనీవాసులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు తదితర సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ దుర్గా, నాయకులు రఘుపతి, రాష్ట్రపాల్‌, శివ, అనిల్‌ పాల్గొన్నారు.

క్రీడలతో శరీరం దృఢంగా ఉంటుంది

ఆదిలాబాద్‌రూరల్‌: క్రీడలతో శరీరం ధృడంగా ఉంటుందని ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అన్నారు. యాపల్‌గూడ శివారులో గల 2వ బెటాలియన్‌లో తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్‌ కంపెనీ వార్షిక క్రీడాపోటీలు ప్రారంభించారు. బెటాలియన్‌ కమాండెంట్‌ వెంకటేశ్వరరెడ్డి, అసిస్టెంట్‌ కమాండెంట్‌ నారాయణ, రఘునాథ్‌ చౌహన్‌, సర్పంచ్‌ నిరోషా, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement