ఆదిలాబాద్‌టౌన్: ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించాలని అదనపు కలెక్టర్ ఆర్‌ఎస్.చిత్రు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాలు పురస్కరించుకుని డీఎంహెచ్‌వో కార్యాలయ సమావేశ మందిరంలో మిఠాయి దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహకులతో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడారు. సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహారం తయారు చేయడం, నిల్వ చేయడంపై ఫుడ్‌సెప్టీ అధికారులు అందించే సూచనలు తప్పని సరిగా పాటించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ టి.నాయక్ సురక్షితమైన ఆహారం తయారీ, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు


