రోడ్డెక్కిన జొన్న రైతులు | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన జొన్న రైతులు

Jun 7 2026 11:51 PM | Updated on Jun 7 2026 11:51 PM

● కొనుగోలు చేసినా తరలింపులో జాప్యంపై ఆందోళన

ఆదిలాబాద్‌టౌన్‌: జొన్నలను కొనుగోలు చేసినప్పటికీ తరలింపులో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు రోడ్డెక్కారు. స్థానిక కొమురంభీంచౌక్‌లో వాహనాలతో ఆదివారం రాస్తారోకో చేపట్టారు. ఆ దిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో జొన్నలను విక్రయించిన రైతులు వాటిని మహేశ్వరి గోదాంకు తరలించగా అక్కడ స్థలం లేదని నిర్వాహకులు చెప్పడంతో రైతులు ఆగ్రహించారు. జొన్నలతో ఉన్న వా హనాలను తీసుకువచ్చి నిరసనకు దిగారు. విష యం తెలుసుకున్న పోలీసులు వారిని సముదా యించి అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, ప్రభుత్వం జొన్నలను కొనుగోలు చేస్తున్నప్పటికీ వాటిని నిల్వ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండిస్తున్న జొన్నలకు స్థలం లేక వాటిని తరలించడం లేదన్నా రు. రోజుల తరబడి వాహనాల్లోనే ఉంచడంతో వా టికి కిరాయి పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశా రు. అధికారులు తగు చర్యలు చేపట్టి పంట నిల్వ కు అవసరమైన గోదాములను అందుబాటులో ఉంచాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement