ఆదిలాబాద్: ఆరోగ్యకరమైన జీవనానికి వ్యాయా మం అవసరమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అ టవీశాఖ ఆధ్వర్యంలో ఆదివారం 5కే రన్ నిర్వహించారు. డీఎఫ్‌వో ప్రశాంత్ బాజీరావు పాటిల్‌తో కలి సి ఆయన ర్యాలీని ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ, వ్యాయామం, క్రీడలు మానసికోల్లాసానికి దోహదం చేస్తాయన్నారు. డీఎఫ్‌వో మాట్లాడుతూ, సైకిల్ దినోత్సవం పురస్కరించుకొని ఈ ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. ఇందులో ఏఎంసీ చైర్మన్ శ్రీ కాంత్‌రెడ్డి, డీవైఎస్‌వో శ్రీనివాస్, డీఎస్పీ జీవన్‌రెడ్డి, ఎఫ్‌డీవో అరవింద్‌కుమార్, ఎఫ్‌డీవో చిన్న భూషరె డ్డి, ఎఫ్‌ఆర్వోలు అవినాష్, షీలానంద, అరుణ, కవి త, సవిత, ఎఫ్‌ఎస్‌వోలు, డీఆర్‌వోలు పాల్గొన్నారు.


