కేఆర్‌కేలో 754.. మావలలో 178 మందికి | - | Sakshi
Sakshi News home page

కేఆర్‌కేలో 754.. మావలలో 178 మందికి

Jun 7 2026 11:51 PM | Updated on Jun 7 2026 11:51 PM

● డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు ● బల్దియా నోటీస్‌బోర్డుపై జాబితా

కై లాస్‌నగర్‌: జిల్లాకేంద్రంలోని రెండు ప్రాంతాల్లో ని ర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు ఎంపిక చేసిన లబ్ధిదారుల తుది జాబితాను బల్దియా అధికారులు ప్రకటించారు. ఆదివారం మున్సిపల్‌ కార్యాలయ నోటీసు బోర్డుపై వారి వివరాలు ప్రదర్శించారు. మొత్తం 932 ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయగా కేఆర్‌కే కాలనీలో 754మందిని, సర్వేనంబర్‌ 170 లో 178 మందిని ఎంపిక చేశారు. కలెక్టర్‌ రాజర్షి షా ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో ర్యాండమైజేషన్‌ ద్వారా ఈ ప్రక్రియ చేపట్టారు. ఇందులో ఏ బ్లాక్‌లోని ఏ ప్లాట్‌ను ఎవరికి కేటాయించాలనే దానిపై త్వరలోనే మున్సిపల్‌ అధికారులు కసరత్తు చేసి చర్యలు చేపట్టనున్నారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తికావడంతో ఏళ్లుగా ఇళ్లకోసం ఎదురుచూస్తున్న నిరుపేదల సొంతింటి కల ఎట్టకేలకు సాకారమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎంపికై న వారికి ఫ్లాట్లు కేటాయించాక బల్దియా అధికారులు అధికారికంగా ఇంటి నంబర్లను కేటాయించనున్నారు. ఇందులో ఎవరైనా అనర్హులైనట్లు తేలితే వారి ఇళ్లను రద్దు చేస్తామని అధికారులు ప్రకటించారు.

బల్దియా నోటీస్‌బోర్డుపై ఉంచిన లబ్ధిదారుల జాబితా

Advertisement
 
Advertisement
Advertisement