● బెల్లంపల్లిలో పెరిగిన పాముల సంచారం ● ఇళ్లలోకి వస్తున్న తేళ్లు ● వారం రోజుల్లో 30 పాములు పట్టివేత ● ఆందోళన చెందుతున్న ప్రజలు | - | Sakshi
Sakshi News home page

● బెల్లంపల్లిలో పెరిగిన పాముల సంచారం ● ఇళ్లలోకి వస్తున్న తేళ్లు ● వారం రోజుల్లో 30 పాములు పట్టివేత ● ఆందోళన చెందుతున్న ప్రజలు

Jun 7 2026 11:51 PM | Updated on Jun 7 2026 11:51 PM

● బెల్లంపల్లిలో పెరిగిన పాముల సంచారం ● ఇళ్లలోకి వస్తున్న తేళ్లు ● వారం రోజుల్లో 30 పాములు పట్టివేత ● ఆందోళన చెందుతున్న ప్రజలు

బెల్లంపల్లి: పురాతన బొగ్గుగనుల ప్రాంతం బెల్లంపల్లి సర్పాలమయంగా మారింది. నిత్యకృత్యంగా విషసర్పాలు విచ్చలవిడిగా సంచారం చేస్తున్నాయి. జననివాసాలు, ఇళ్ల పరిసరాలు, వీధులు, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ స్వైరవిహారం చేస్తున్నాయి. రక్తపింజరలు, నాగుపాములు ఇళ్లలో వచ్చి తిష్ట వేస్తుండగా, తేళ్లు సైతం దూరుతున్నాయి. ప్రాణాంతకమైన సర్పాలు, తేళ్ల బెడద పురప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వీటి సంచారంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల అకాల వర్షాలు కురుస్తుండటంతో పుట్టల్లోంచి పాములు, తేళ్లు బయటకు వస్తున్నాయి.

ఏ బస్తీలో చూసినా..

మున్సిపాలిటీలో 34 వార్డులు ఉండగా వీటిలో సగానికి పైగా వార్డుల్లో పాముల ప్రభావం ఉంది. ముఖ్యంగా అటవీ, శివారుబస్తీలు, మూసివేతకు గురైన కార్మికవాడలు, తుమ్మ, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి చిత్తడిగా ఉన్న ప్రతీ ప్రాంతం కూడా పాములు, తేళ్లకు నిలయాలుగా మారాయి. శాంతిఖని, 65 డీప్‌, సుభాష్‌నగర్‌, నెంబర్‌–2 ఇంక్‌లైన్‌, రైల్వే రడగంబాల బస్తీ, అంబేడ్కర్‌ రడగంబాల బస్తీ, పెద్దనపల్లి, సుబ్బారావుపల్లి, కాల్‌టెక్స్‌ ఏరి యా, గంగారాం నగర్‌, గాంధీనగర్‌, కన్నాల బస్తీ, మధునన్ననగర్‌, టేకుల బస్తీ, 24 డీప్‌ ఏరియా, కొత్తబస్టాండ్‌ ఏరియా ఇందిరమ్మ కాలనీ, కాంట్రాక్టర్‌ బస్తీ, షంషీర్‌నగర్‌, రవీందర్‌నగర్‌, అంబేద్కర్‌నగర్‌, బెల్లంపల్లి బస్తీ, హన్మాన్‌ బస్తీ, అశోక్‌నగర్‌, బూడిదగడ్డ, బాబుక్యాంపు బస్తీ, గోల్‌బంగ్లాబ స్తీ తదితర కార్మిక, కార్మికేతర బస్తీల్లో పాములు, తే ళ్ల సమస్య స్థానికులను తీవ్ర వేదనకు గురిచేస్తోంది.

వారం రోజుల్లో..

పాముల్లో రక్త పింజర, తాచుపాములు ప్రమాదకరమైనవి. వీటి కాటుకు గురైతే ప్రాణాలు కోల్పోయే ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. అవి జన నివాసాల్లో సంచరిస్తుండడం గమనార్హం. కాల్‌టెక్స్‌, 65 డీప్‌ ఏరియా, శాంతిఖని, సుబ్బారావుపల్లి, గంగారాంనగర్‌, గోల్‌ బంగ్లాబస్తీ, నెంబర్‌–2 ఇంక్‌లైన్‌, సుభాష్‌నగర్‌ తదతర ప్రాంతాల్లో రక్త పింజరల ప్రభావం అఽధికంగా ఉండగా ఇతర బస్తీల్లో నాగుపాములు సంచరిస్తున్నాయి. ఇళ్ల పరిసరాలు, గల్లీలు, వీధుల్లో పిచ్చిమొక్కలతో చిత్తడి వాతావరణం ఉండగా , కొన్ని బస్తీలను ఆనుకుని అటవీ ప్రాంతం ఉండటం, మూసివేతకు గురైన బొగ్గు గనులు పాములకు స్థావరాలుగా మారడంతో పాముల సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో ఏకంగా 30కిపైగా స్నేక్‌ క్యాచర్లు పట్టుకున్నట్లు సమాచారం. వీటిలో 15 వరకు రక్తపింజరలు ఉండగా మిగతా తాచుపాములు ఉన్నాయి. తేళ్లు కూడా లెక్కలేనన్నీ ఇళ్లలోకి వస్తున్నట్లు పురప్రజలు చెబుతున్నారు. పట్టుకున్న పాములను స్నేక్‌ క్యాచర్లు ప్లాస్టిక్‌ బాటిళ్లు, సంచుల్లో వేసి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలి పెడుతున్నారు. జననివాసాలకు చేరువలో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి, సర్పాల సమస్యను పరిష్కరించాలని పురప్రజలు కోరుతున్నారు.

తేళ్లు వస్తున్నాయి

ఇళ్ల పరిసరాల్లో పాములు, తేళ్లు భయపెట్టిస్తున్నాయి. ఒకసారి పాము కనిపిస్తే మరోసారి ఐదారు తేళ్లు వస్తున్నాయి. ఏమాత్రం జాగ్రత్తగా లేకపోతే వాటి కాటుకు గురయ్యేవాళ్లం. పిల్లలు వణికిపోతున్నారు. పాములు, తేళ్లు రాకుండా మున్సిపల్‌ అధికారులు కట్టడి చర్యలు తీసుకోవాలి.

– మేకల భాగ్యలక్ష్మి, టేకులబస్తీ

భయంగా ఉంది

ఇళ్ల చుట్టూ రెండు, మూడు పాములు తిరుగుతున్నయ్‌. చీకటి పడటంతోనే చేరుతున్నయ్‌. రెండు రోజుల క్రితం పాము వచ్చింది. కొద్ది దూరం నుంచి చూసి కేకలు వేసి బయటకు పరుగుతీశాను. ఓ యువకుడు చాకచక్యంగా పామును పట్టుకుని ప్లాస్టిక్‌ డబ్బాలో వేసి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. ఇట్ల పాములతో భయం భయంగా గడుపుతున్నం.

– వేల్పుల శాంత, టేకులబస్తీ

పట్టుకుని వదిలేస్తున్నా

మున్సిపాలిటీలో సర్పాలు స్వైరవిహారం చేస్తున్నాయి. వీటిలో ప్రాణాంతక రక్తపింజరలు, తా చుపాముల సంఖ్య అధికంగా ఉంది. గతంలో రక్త పింజరలు, నాగుపాములు అడపాదడపా కనిపించగా ప్రస్తుతం ప్రతి బస్తీలోనూ దర్శనమిస్తున్నాయి. వీటి సంతతి వృద్ధి చెందినట్లు కనిపిస్తుంది. వారం నుంచి రోజుకు రెండు, మూడు పాములను ప ట్టుకునిసురక్షితంగాఅటవీప్రాంతంలోవదిలేస్తున్నాను.

– దుర్గా రాజేష్‌, సీనియర్‌ స్నేక్‌క్యాచర్‌, బెల్లంపల్లి

Advertisement
 
Advertisement
Advertisement