మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలో డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆధ్వర్యంలో శనివారం అర్ధరాత్రి నాకబందీ, ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలీ సులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో లాడ్జీలు, బస్టాండ్, రైల్వేస్టేషన్, ప్రధాన చౌ రస్తాల వద్ద విస్తృత తనిఖీ జరిపారు. అర్ధరాత్రి బైక్‌లపై తిరుగుతున్న వారికి డ్రంకెన్ డ్రైవ్‌పరీక్షలు చేశారు. అదుపులో తీసుకుని విచారించి వివరాలు సేకరించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ర్యాష్ డ్రైవింగ్, బైక్‌లపై స్టంట్ల చేస్తున్నవారిపై లాఠీ ఝులిపించారు. లాడ్జీ గదులను డీసీపీ తనిఖీ చేశారు. అద్దెకు ఉన్నవారిలో అనుమానితులను విచారించారు. సీసీ కెమెరాలు, రికార్డు సక్రమంగా ఉండాలని, రాష్ట్రాల నుంచి వచ్చేవారి వివరాలు సేకరించాలని నిర్వాహకులకు సూచించారు. నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ ప్రమోద్‌రావు, ఎస్సైలు మధుసూదన్, తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.


