లోకేశ్వరం: చేపల వేటకెళ్లిన జా లరి ప్రమాదవశాత్తు తెప్ప పై నుంచి జారిపడి నీటిలో మునిగి మృతిచెందాడు. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మ ండలకేంద్రానికి చెందిన చౌటోల్ల నడ్పి పోశెట్టి(49), పోచమ్మ చెరువులో చేపలు పడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శని వారం మధ్యాహ్నం చేపలు పట్టేందుకు పోచమ్మ చెరువులోకి వెళ్లాడు. రాత్రివరకు ఇంటి రాకపోవడంతో కుటుంబీకులు గ్రామస్తుల సహకారంతో చె రువులో గాలింపు చేపట్టిన ఫలితం లేకపోయింది. ఆ దివారం ఉదయం శవమై కనిపించాడు. తెప్ప సహా యంతో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు తెప్పపైనుంచి జారిపడి నీటిలో మునిగి మృతిచెంది ఉంటాడని ఎస్సై తెలిపారు. పోశెట్టికి భార్య రసుల, కుమారుడు శ్రీకాంత్ ఉన్నారు. కుమారుడి ఫిర్యాదుతో ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.


