కూలీ రేట్ల్ల పెంపుపై ప్రభుత్వం నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

కూలీ రేట్ల్ల పెంపుపై ప్రభుత్వం నిర్లక్ష్యం

Jun 7 2026 11:51 PM | Updated on Jun 7 2026 11:51 PM

బెల్లంపల్లి:పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాద్‌ అన్నారు. బెల్లంపల్లి అంబేద్కర్‌ కమ్యూనిటీ హాల్‌లో వ్యవసాయ కా ర్మిక సంఘం జిల్లా మూడో మహాసభలు ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ప్రసాద్‌ హాజరై మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చినప్పటి నుంచి కూలీ రేట్లను పెంచలేదన్నారు. కూలీలపై వివక్ష ప్రదర్శిసస్తోందని విమర్శించారు. కమ్యూనిస్టులు పోరాడి సాధించుకున్న ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేసి కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ఎరువుల ధరలు పెంచి రైతులపై భారం మోపుతోందన్నారు. కూలీ రేట్లు పెంచుతామని హామీ ఇచ్చి రా ష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ ఊసెత్తడం లేదన్నారు. ప్రధాన మంత్రి మోదీ అనుసరిస్తున్న విధానాలతో వ్యవసాయ కూలీలు బానిసలుగా మారుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ వృత్తిదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైళ్ల ఆశయ్య మాట్లాడుతూ.. గ్రామాల్లో వ్యవసాయ యంత్రాలు వచ్చిన తర్వాత కూలీలకు పనులు దొరకడం లేదని తెలిపారు. వలసలు పెరుగుతున్నాయన్నారు. వ్యవసాయ కార్మికులు, కూలీలకు ఇందిరమ్మ ఇళ్లు, ఫించన్లు, జాబ్‌కార్డు, ఇన్సూరెన్స్‌ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

నూతన కమిటీ ఎన్నిక

మహాసభలో మంచిర్యాల జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా గుమాస అశోక్‌, ఉపాధ్యక్షులుగా కృష్ణమాచారి , గోమాసబాపు, ఎం.జయ, కార్యదర్శిగా కనికరపు అశోక్‌, సహాయ కార్యదర్శులుగా వేల్పుల శంకర్‌, రాజమణి , నరేందర్‌, సరిత, కోశాధికారిగా ముడిమడుగుల బ్రహ్మయ్యను ఉన్నుకున్నారు. మరో 10 మందిని సభ్యులుగా ఎంపిక చేశారు. ఈ మహాసభలో వ్యవసాయ కార్మిక సంఘం, వృత్తిదారుల సంఘం, ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement