టీజీ–20 ఖమ్మం ఏసేస్‌ జట్టులో హిమతేజ | - | Sakshi
Sakshi News home page

టీజీ–20 ఖమ్మం ఏసేస్‌ జట్టులో హిమతేజ

Jun 7 2026 11:51 PM | Updated on Jun 7 2026 11:51 PM

● వేలంలో రూ.8 లక్షలు పలికిన యువ క్రికెటర్‌

● వేలంలో రూ.8 లక్షలు పలికిన యువ క్రికెటర్‌

ఆదిలాబాద్‌: జిల్లాకేంద్రానికి చెందిన యువ క్రికెటర్‌ కొడిమెల హి మతేజ హెచ్‌సీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీజీ–20 వేలంలో సత్తాచాటాడు. హైదరాబాద్‌ వేదికగా ఆదివారం నిర్వహించిన టీజీ–20 క్రికెట్‌ లీగ్‌ వేలంలో ఖమ్మం ఏసేస్‌ జట్టు రూ.8 లక్షలకు దక్కించుకుంది. దేశవాళీ క్రికెట్లో సత్తాచాటుతున్న యువ కెరటం తాజాగా టీజీ–20 లీగ్‌లో అత్యధిక ధర పలకడం విశేషం. లీగ్‌లో ఎంపిక కావడం పట్ల కోచ్‌ జయేంద్ర పటాస్కర్‌ అభినందనలు తెలిపారు.

మందమర్రిలో

ఆర్టీసీ బస్సు బోల్తా

మందమర్రిరూరల్‌:మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని జాతీయ రహదారిపై కేకే ఓసీపీ సమీపంలో కొత్తగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్‌లగ్జరీబస్సు(టీఎస్‌28జెడ్‌ 0109) ఆదివారం తెల్లవారుజామున బోల్తాపడింది. కొత్తగూడెం నుంచి బెల్లంపల్లికి వస్తుండగా ఓసీపీ సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తాపడింది. తెల్లవారుజామున ప్రమా దం జరగడంతో ఆ సమయంలో రోడ్డుపై రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్‌ సీతారాం, తాళ్లగురిజాలకు చెందిన ప్రయాణికుడు ప్రవీణ్‌కుమార్‌ మాత్రమే ఉన్నారు. వీరికి స్వల్పగాయాలు కాగా స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలుగకుండా పట్టణ ఎస్సై నరేశ్‌ ఆధ్వర్యంలో బస్సును రోడ్డుపై నుంచి తొలగించారు. బస్సు డ్రైవర్‌ సీతారాం బీపీ పడిపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement