నో పైరవీ.. నో రెక్వెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

నో పైరవీ.. నో రెక్వెస్ట్‌

Jun 7 2026 3:57 AM | Updated on Jun 7 2026 3:57 AM

ఉమ్మడి ఆదిలాబాద్‌ ఎకై ్సజ్‌లో ఉన్నత పోస్టులకి సంబంధించి..

డీసీ, డీపీఈవోలుగా త్వరలో కొత్త ఆఫీసర్లు

రెండు నెలల క్రితమే శాఖలో పదోన్నతులు

తాజాగా బాధ్యతలు కేటాయింపు ప్రక్రియ

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదాయం అధికంగా ఉండే శాఖల్లో ఉన్నతాధికారుల బదిలీల ప్రక్రియ చోటు చేసుకుంటుందంటే అందులో పైరవీలు, రెక్వెస్టూ లు సాధారణం. జిల్లాకు వచ్చేందుకు ఆ అధికారి జోరుగా పైరవీ చేస్తున్నారట.. రాష్ట్ర మంత్రిని కలిశారట.. మరో ఆఫీసర్‌ రిక్వెస్ట్‌ పెట్టుకున్నాడట.. అందుకోసం రూ.లక్షలు కూడా సమర్పించుకునేందుకు వెనకాడటం లేదట.. అనే చర్చ సాగుతోంది. అయి తే ఎకై ్సజ్‌ శాఖ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పరి స్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఆ శాఖలో రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లా బాస్‌ డిప్యూటీ కమిషనర్‌(డీసీ), నాలుగు జిల్లాలకు డీపీఈవోలుగా కొత్త అధికారులు త్వరలో రావడం ఖాయమని తేలింది. అయితే ఎవరు వస్తారో తెలియని పరిస్థితి ఉందని ఆ శాఖలో చెప్పుకుంటున్నారు. ఏ ఒక్క అధికారి కూడా ఉమ్మడి ఆదిలాబాద్‌లో పోస్ట్‌ కావాలని పైరవీ చేసుకోలేదని, రెక్వెస్ట్‌ మాటే లేదనే చర్చ సాగుతోంది. పనిష్మెంటు పైనే కొత్త అధికారులను పైనుంచి పంపుతారని చెప్పుకోవడం గమనార్హం.

రెండు నెలల క్రితం ఎకై ్సజ్‌ శాఖలో రాష్ట్రవ్యాప్తంగా పదోన్నతుల ప్రక్రియ చోటుచేసుకుంది. సీఐలు, అసిస్టెంట్‌ సూపరింటెండెంట్లు, ఈఎస్‌లు, ఏసీలకు ప్రమోషన్‌ లభించింది. డిప్యూటీ కమిషనర్‌ వరకు పదోన్నతులు అందాయి. తాజాగా వారికి పోస్టింగ్‌ కేటాయింపు ప్రక్రియ చోటు చేసుకుంటుంది. పక్కనున్న పలు ఉమ్మడి జిల్లాలకు ఆఫీసర్లుగా వచ్చేందుకు పలువురు పైరవీలు, రెక్వెస్ట్లు చేసుకుంటుండగా ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాకు మాత్రం ఆ పరిస్థితి లేదని చెప్పుకుంటున్నారు. ఆ జిల్లాలో ‘పచ్చగడ్డి బాగుంటుందని, ఆ జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడ ఎండుగడ్డి మాత్రమేనని’ అందుకే ఇక్కడికి వచ్చేందుకు ఎవరు సుముఖంగా ఉండరని, ఆ శాఖలోని ఓ ఉద్యోగి పేర్కొనడం పరిస్థితికి అద్దం పడుతుంది. అలాగని ఉమ్మడి జిల్లాలో ఆదాయం ఉండదనే ది కాదని, ఇతర జిల్లాలతో పోల్చుకుంటే ఆ స్థాయిలో ఉండకపోవడంతోనే ఈ పరిస్థితి అని బాహాటంగానే చెప్పుకోవడం గమనించదగ్గ విషయం.

ఇది పరిస్థితి..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ (డీసీ)గా రఘురాం ఇన్‌చార్జి ఆఫీసర్‌గా కొద్ది నెలలుగా కొనసాగుతున్నారు. హైదరాబాద్‌ డీసీ కార్యాలయంలో అధికారిగా కొనసాగుతున్న ఆయన ఉమ్మ డి ఆదిలాబాద్‌, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలకు ఇన్‌చార్జి డీసీగా కొనసాగుతున్నారు. పలువురు డీసీలుగా పదోన్నతులు పొందడంతో తాజా ప్రక్రియలో ఉమ్మడి జిల్లాలకు బాస్‌ లను నియమించనున్నారని, రఘురాంను ఇక్కడి బాధ్యతల నుంచి తప్పించి వేరే అధికారికి పోస్టింగ్‌ ఇవ్వడం ఖాయమని శాఖలో చర్చ సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్‌, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాలకు డీపీఈవో (ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌) లుగా హిమశ్రీ, నందా గోపాల్‌, జ్యోతి కిరణ్‌, రజాక్‌ కొనసాగుతున్నారు. సుదీర్ఘకాలంగా ఆ జిల్లాల్లో పనిచేస్తుండడంతో వారి బదిలీ లు ఖాయం. వారి స్థానంలో కొత్త ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌లు రానున్నారు. ఈ పోస్టులకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో బాధ్యతలు నిర్వర్తించేందుకు ఏ ఆఫీసర్‌ కూడా పైరవీ, రెక్వెస్టులు లేవని, అక్కడి నుంచి పంపే వారే ఇక్కడికి వస్తారని చెప్పుకుంటున్నారు.

కొరవడిన పర్యవేక్షణ..

ఉమ్మడి జిల్లా బాస్‌ డీసీ ఇన్‌చార్జిగా కొనసాగుతుండడంతో ఆయన అడపాదడపా వస్తుండడంతో పర్యవేక్షణ కొరవడింది. ఈ కార్యాలయంలోనే అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్ట్‌ కూడా ఇన్‌చార్జితోనే నడిపిస్తున్నారు. రెండు కీలకమైన పోస్టుల్లో ఇన్‌చార్జీలు ఉండడంతో పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉందనే విమర్శలు లేకపోలేదు. ఇక ఏసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, జిల్లా టాస్క్‌ ఫోర్సుల్లో అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలనే డిమాండ్‌ వ్యక్తమవుతుంది. ఇటీవల జిల్లాలో గంజాయి సాగు కేసులు అధికంగా నమోదవుతున్నాయి. గుడుంబా కేసులు కూడా పోలీసులు దాడి చేసి పట్టుకునే పరిస్థితి ఉంది. పర్యవేక్షించే శాఖలో పోస్టులు ఖాళీగా ఉండడంతో నియంత్రణ కొరవడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement