తలమడుగు: పల్లి(బి) గ్రామాన్ని జిల్లాలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రజాపాలన–ప్రగతిప్రణాళికలో భాగంగా నిర్వహించిన గ్రామసభకు కలెక్టర్ హాజరయ్యారు. గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సత్వరం పరి ష్కరించేలా చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీటి సంరక్షణ, వ్యవసాయ ప్రణాళికలపై ఫోకస్ పెంచాలన్నారు. బీఎల్‌వోలు జూన్ 24లోగా వంద శాతం ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అలాగే మిషన్ భగీరథ పైప్‌లైన్ విస్తరణ, సీసీ రోడ్లు, వైకుంఠ ధామాలు, అంగన్‌వా డీ భవనాల నిర్మాణానికి సంబంధించిన అంచనా లు పరిశీలించి త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్‌మోహన్, ఎంపీడీవో శంకర్, సర్పంచ్ సంజీవ్, పంచాయతీ కార్యదర్శి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.


