తాంసి: బాలల హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలోని కప్పర్ల గ్రామంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఆధ్వర్యంలో శనివారం బాల పంచాయత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా వంటి సామాజిక సమస్యలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని సూచించారు. బాలికలపై వివక్ష చూపకూడదన్నారు. గ్రామాల్లో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలను ఏర్పాటు చేసి బాలల సంక్షేమం, భద్రతపై నిరంతర సమీక్ష నిర్వహించాలన్నారు. ఇళ్లలో, పాఠశాలల్లో చైల్డ్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేయాలని, సమస్యలను నిర్భయంగా వివరించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, అదనపు ఎస్పీ పి.మౌనిక, డీఈవో మాధవి, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్‌రెడ్డి, డీసీపీవో రాజేంద్ర ప్రసాద్, ష్యూర్ ఎన్జీవో కోఆర్డినేటర్ వినోద్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సీసీఎస్ సీఐ చంద్రశేఖర్, కప్పర్ల సర్పంచ్ అరుణ్‌కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ నారాయణ, హెచ్‌ఎం ఆనంద్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


