బాల్యవివాహ రహిత జిల్లాగా నిలుపాలి | - | Sakshi
Sakshi News home page

బాల్యవివాహ రహిత జిల్లాగా నిలుపాలి

Feb 27 2026 7:25 AM | Updated on Feb 27 2026 7:25 AM

బాల్యవివాహ రహిత జిల్లాగా నిలుపాలి

బాల్యవివాహ రహిత జిల్లాగా నిలుపాలి

● కలెక్టర్‌ రాజర్షి షా

కైలాస్‌నగర్‌: జిల్లాను బాల్య వివాహ రహితంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది కంకణబద్ధులు కావాలని కలెక్టర్‌ రాజర్షి షా పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని రెవెన్యూ గా ర్డెన్స్‌లో బాల్య వివాహ నిరోధక చట్టంపై అధికారులకు నిర్వహించిన అభయ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జ్యో తి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మా ట్లాడారు. గ్రామ, మండల పట్టణ స్థాయిల్లో బాలల సంరక్షణ కమిటీలు వేసి ప్రతినెలా విధిగా సమావేశం నిర్వహించాలన్నారు. గణాంకాలకే పరిమితం కాకుండా, బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న ‘హాట్‌ స్పాట్‌’ ప్రాంతాలను గుర్తించి, అక్కడ వివాహాలు జరగడానికి గల మూల కారణాలను విశ్లేషించాలని సూచించారు. బాల్య వివాహాల ద్వా రా కలిగే అనర్థాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఇందుకోసం కళాజాత, రంగోలి, వ్యాసరచన పోటీలు, ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. బాల్య వివాహాలకు సహకరించే పురోహితులు, ఇమామ్‌లు, టెంట్‌ హౌస్‌ నిర్వాహకులు, క్యాటరర్లు, శుభలేఖలు ముద్రించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆదేశించారు. బాల్య వివాహాల గురించి సమాచారం ఇచ్చే వారి వివరా లు అత్యంత గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చా రు. బాల్య వివాహ రహిత పంచాయతీలను ప్రకటించేందుకు ‘బాల వివాహ ముక్త్‌ భారత్‌’ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలని తెలిపారు. ఉత్తమంగా పనిచేసే పంచాయతీ కార్యదర్శులు, అధికా రులకు జిల్లా యంత్రాంగం తరఫున ప్రశంసాపత్రాలు, అవార్డులు అందజేస్తామని తెలిపారు. అనంతరం బాల్య వివాహాల నిషేధంపై సీఎంపీవోలతో కలెక్టర్‌ ప్రతిజ్ఞ చేసి కార్యక్రమానికి సంబంధించిన సెల్ఫీ పాయింట్‌ వద్ద అధికారులతో కలిసి ఫొటోలు దిగారు. కాగా, బాల్య వివాహాలతో కలిగే అనార్ధాల గురించి తెలిపేలా చిన్నారులు ప్రదర్శించిన నృత్యరూపక నాటిక ఆకట్టుకుంది. అడిషనల్‌ కలెక్టర్లు శ్యా మలాదేవి, రాజేశ్వర్‌, డీపీవో రమేశ్‌, డీడబ్ల్యూవో మిల్కా, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సీడీపీవోలు, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement