ఆరువేల ఎకరాలు గుర్తించాం
పారిశ్రామిక వాడ ఏర్పాటుకు 10వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ సృష్టించేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఇందులో భాగంగా ఇప్పటికే ఆరువేల ఎకరాలు గుర్తించాం. ఏరియల్ సర్వేలో ఎయిర్‌పోర్టు కోసం భూ సేకరణను పరిశీలించాం. సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీనీ పరిశీలించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీపీపీ మోడ్‌లో పునరుద్ధరించేలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక్కడ సున్నపురాయి నిక్షేపాలున్నందున సిమెంట్ ఫ్యాక్టరీని పుఃనప్రారంభించే అవకాశాలున్నాయి.
– పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే


