ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా బదిలీ
కైలాస్‌నగర్: ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికా రి ఖుష్బూ గుప్తా బది లీ అయ్యారు. ప్రస్తు తం ప్రసూతి సెలవులో ఉన్న ఆమెను మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చే సింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2019 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె తొలుత ఆది లాబాద్ స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్‌గా ని యమితులయ్యారు. 2024 ఫిబ్రవరిలో ఉట్నూ ర్ ఐటీడీఏ పీవోగా బదిలీ అయిన ఆమె అదే ఏడాది నవంబర్ 4నుంచి ప్రసూతి సెలవుపై వెళ్లారు. ఈ ఏడాది మే 3వరకు ఆమెకు ప్రభుత్వం సెలవు మంజూరు చేసినా తాజాగా జిల్లా నుంచి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ స్థానంలో పీవోగా కొత్త అధికారులెవరినీ నియమించలేదు. ప్రస్తుతం ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ ఇన్‌చార్జి పీవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.


