● అద్దె ఇళ్లలో కొనసాగుతున్న తహసీల్దార్ కార్యాలయాలు ●
కై లాస్‌నగర్: జిల్లాలోని పలు రెవెన్యూ కార్యాలయాలకు మహర్దశ పట్టనుంది. పరిపాలనలో కీలకమైన తహసీల్, ఆర్డీవో కార్యాలయాలకు నూతన శాశ్వత పక్కా భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అద్దె భవనాలు, శిథిలావస్థకు చేరిన కార్యాలయాలకు రెండు విడతల్లో నూతన భవనాలు నిర్మించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ భవనాలన్నింటినీ ఒకే నమూనాలో నిర్మించేలా ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. మంత్రి మాటలు కార్యరూపం దాల్చితే అద్దె కష్టాలు తొలగడంతో పాటు శిథిలావస్థకు చేరిన భవనాల స్థానంలో నూతన భవనాలు నిర్మించనున్నారు.
పాలనలో కీలకమైనా పరేషానే..
జిల్లా పరిపాలనకు రెవెన్యూశాఖ గుండెకాయలాంటింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఈ శాఖనే అత్యంత కీలకమైంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమం చేపట్టాలన్న రెవెన్యూ వ్యవస్థదే ప్రధాన పాత్ర. ఇంతటి ప్రాధాన్యత కలిగిన రెవెన్యూ శాఖకు సంబంధించి క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు అమలు చేయడంలో తహసీల్దార్లు కీలకపాత్ర పోషించనున్నారు. అలాంటి తహసీల్దార్ కార్యాలయాలకు సొంత భవనాలు కరువయ్యాయి. ఒకటి, రెండు మండలాలను మినహాయిస్తే జిల్లాలోని మెజార్టీ తహసీల్దార్ కార్యాలయాలకు పక్కా భవనాలు లేవు. అద్దె ప్రతిపాదికన కొన్ని చోట్ల కొనసాగుతుండగా, మరి కొన్నిచోట్ల ఇతర శాఖల ప్రభుత్వ భవనాల్లో కార్యాలయాలను నిర్వహిస్తున్నారు. వాటిలో సరైన సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
జిల్లాలో ఇదీ పరిస్థితి
ఆదిలాబాద్ ఆర్డీవో కార్యాలయానికి సొంత భవనం లేకపోవడంతో తాత్కాలికంగా కలెక్టరేట్ ప్రాంగణంలోని జైళ్లశాఖ కార్యాలయ భవనంలో నిర్వహిస్తున్నారు. తలమడుగు తహసీల్దార్ కార్యాలయం ఎంపీడీవో కా ర్యాలయ ఆవరణలోని రేకుల షెడ్లలో అరకొర వసతుల మధ్య కొనసాగుతోంది. ఆదిలాబాద్ రూరల్ తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌శాఖ పీడీ అధికారిక నివాస భవనంలో తాత్కాలికంగా నిర్వహిస్తున్నారు. భీంపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని తాత్కాలిక రేకుల షెడ్డులో నిర్వహిస్తుండగా, తాంసి కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరింది. ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా పరిషత్ కార్యాలయంలో, సిరికొండ తహసీల్దార్ కార్యాలయాన్ని అక్కడి వెటర్నరీ భవనంలో, సాత్నాల తహసీల్దార్ కార్యాలయాన్ని మత్స్యశాఖ భవనంలో, భోరజ్ తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనంలో, మావల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కేంద్రంలోని ఆర్డీవో క్యాంపు కార్యాలయ భవనంలో, గాదిగూడ తహసీల్దార్ కార్యాలయాన్ని అక్కడి ఆదివాసీ కమ్యూనిటీ భవనంలో, బజార్‌హత్నూర్ కార్యాలయాన్ని వైద్యారోగ్యఽశాఖ భవనంలో, బోథ్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఎన్నికల సంఘ భవనంలో తాత్కాలికంగా నిర్వహిస్తున్నారు. నేరడిగొండ తహసీల్దార్ కార్యాలయం సొంత భవనంలో సాగుతున్నా అది కూడా శిథిలావస్థకు చేరింది. సొంత భవనాల్లేక అరకొర వసతులతో కూడిన భవనాల్లో రెవెన్యూ పరిపాలన సాగిస్తున్నారు. అధికారులతో పాటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందుల మధ్య పాలన వ్యవహారాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించడంతో వారిలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. త్వరగా కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ఆత్మగౌరవం పెంచేలా..
జిల్లాలో 21 మండలాలున్నాయి. ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి ఆర్డీవో కార్యాలయం కొనసాగుతుండగా, ఉట్నూర్ రెవెన్యూ డివిజన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. ఆర్డీవో స్థానంలో సబ్ కలెక్టర్‌ను నియమించింది. అయితే, పలు తహసీల్దార్ కార్యాలయాలకు సొంత భవనాలు లేక ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో తాత్కాలికంగా కొనసాగిస్తున్నారు. మరికొన్ని మండలాల్లో సొంత భవనాలున్నా అవి శిథిలావస్థకు చేరాయి. దీంతో వివిధ పనుల నిమిత్తం ఆయా కార్యాలయాలకు వచ్చే ప్రజలు సరైన వసతుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిని దూరం చేసి రెవెన్యూ ఉద్యోగులు ఆత్మస్థైర్యంతో గౌరవంగా విధులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. తహసీల్దార్ కార్యాలయాన్నింటికీ పక్కా భవనాలు నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
ఇది ఆదివాసీ కమ్యూనిటీ భవనంలో ఇరుకై న గదులు, అరకొర వసతులతో కొనసాగుతున్న గాదిగూడ తహసీల్దార్ కార్యాలయం. సరైన వసతులు లేక వివిధ పనుల కోసం ఇక్కడికి వచ్చే ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.
ఇది బజార్‌హత్నూర్ మండల
కేంద్రంలోని వైద్యారోగ్యశాఖ పాత భవనంలో కొనసాగుతున్న తహసీల్ కార్యాలయం. పురాతన భవనం కావడంతో శిథిలావస్థకు చేరింది. ఉద్యోగులు, సందర్శకులు అవస్థలు పడుతున్నారు.
● అద్దె ఇళ్లలో కొనసాగుతున్న తహసీల్దార్ కార్యాలయాలు ●
● అద్దె ఇళ్లలో కొనసాగుతున్న తహసీల్దార్ కార్యాలయాలు ●
● అద్దె ఇళ్లలో కొనసాగుతున్న తహసీల్దార్ కార్యాలయాలు ●


