గాడిన పడేనా..? | - | Sakshi
Sakshi News home page

గాడిన పడేనా..?

Feb 22 2026 7:23 AM | Updated on Feb 22 2026 7:23 AM

గాడిన పడేనా..?

గాడిన పడేనా..?

● బల్దియాలో ప్రత్యేక పాలనకు తెర ● అందుబాటులోకి నూతన కౌన్సిల్‌ ● కొత్త పాలకవర్గంపై పట్టణవాసుల గంపెడాశలు

కై లాస్‌నగర్‌: బల్దియాలో ప్రత్యేకాధికారి పాలనకు ఎట్టకేలకు తెరపడింది. ప్రజలు ఎన్నుకున్న నూతన పాలకవర్గం అందుబాటులోకి వచ్చింది. దాదాపు 12 నెలల పాటు పాలకులు లేకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో మున్సిపల్‌ పా లన పూర్తిగా గాడి తప్పింది. వార్డుల్లోని సమస్యల ను ఆలకించే వారు కరువయ్యారు. పలు విభాగాల అధికారులు, ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. సమయపాలన పాటించకపోవడంతో ప్రజలకు సకాలంలో సేవలు అందని పరిస్థితి. అలాగే పలు విభాగాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో నూతన పాలకవర్గం ఏ విధంగా పారదర్శకమైన పాలన అందిస్తుందో అని పుర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అక్రమాలకు చెక్‌ పడేనా..

పట్టణంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ఇంజినీరింగ్‌ విభాగం ద్వారా చేపట్టిన పలు టెండర్ల ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నట్లుగా విమర్శలు వ్యక్తమయ్యాయి. కొంతమంది అధికారులు తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలు తుంగలో తొక్కారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. టెండర్ల ప్రక్రియ నిర్వహించకుండానే లక్షలాది రూపాయల విలువైన సా మాగ్రి కొనుగోలు చేయడం వివాదాస్పదమైంది. కలెక్టర్‌ రాజర్షి షాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో వాటిపై విచారణకు సైతం ఆదేశించిన విష యం తెలిసిందే. వీధి దీపాల నిర్వహణకు సంబధించిన టెండర్‌ ఖరారైన ఇప్పటికి సామగ్రి సరఫరా పూర్తిస్థాయిలో కాలేదని తెలుస్తోంది. అలాగే వివిధ అభివృద్ధి పనుల కోసం టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా రూ.18.50 కోట్ల పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఉద్దేశ పూర్వకంగానే జాప్యం చేసినట్లుగా సమాచారం. తాజాగా వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

పర్యవేక్షణ అస్తవ్యస్తం

కౌన్సిల్‌ లేకపోవడం, ప్రత్యేకాధికారులు అంతగా దృష్టి సారించకపోవడంతో బల్దియా పాలన వ్యవహారాలు పూర్తిగా గాడితప్పాయి. పలు విభాగాల అధికారులు కార్యాలయంలో ప్రజలకు అందుబా టులో ఉండటం లేదు. ఇష్టారాజ్యాంగా విధులకు వచ్చి వెళ్తున్నారనే ఫిర్యాదులున్నాయి. ఎవరైనా ప్ర శ్నిస్తే అధికారులు ఫీల్డ్‌ విజిట్‌కు వెళ్లారని చెబుతుండటం గమనార్హం. ఇక తాగునీటి సరఫరా విభాగంలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు.. ఎవరు ఎక్క డ పనిచేస్తున్నరనే వివరాలు సాక్షాత్తు ఆ శాఖ ఇంజినీరింగ్‌ అధికారుల వద్దనే లేకపోవడం క్షేత్రస్థాయిలో వారిపై పర్యవేక్షణకు అద్దం పడుతోంది. శానిటేషన్‌ విభాగంలో పనిచేసే ఒకరిద్దరు ఉద్యోగులు ఏళ్ల తరబడి విధులకు రాకుండానే వేతనాలు పొందుతున్నట్లుగా ఆ విభాగంలో చర్చించుకోవడం గమనా ర్హం.ఇకప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవ లందించాల్సిన వార్డుఆఫీసర్లలో పలువురు ఇతర జి ల్లాల నుంచి రాకపోకలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లోనూ చేతి వాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.

తప్పుడు బిల్లులతో లక్షలు స్వాహా..!

బల్దియాలో పారిశుద్ధ్యం, ఇంజినీరింగ్‌ విభా గాలు అత్యంత కీలకం. పట్టణంలో చెత్త సేకరణ, తాగునీటి సరఫరాకు వినియోగించే ట్రాలీ ఆటోలు, ట్రాక్టర్లు వంటి వాహనాల నిర్వహణకు ప్రతి నెలా రూ.లక్షల్లో వెచ్చిస్తున్నారు. ఇంధనం, నిర్వహణ పేరిట కొంతమంది ఉద్యోగులు అధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు బిల్లులతో రూ.లక్షలాది రూపాయలు స్వాహా చేస్తున్నారనే విమర్శలున్నాయి. దీనిపై గతంలో సాక్షాత్తు ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అధికారులను ప్రశ్నించడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇలాంటి అక్రమ వ్యవహారాలను కట్టడి చేసేలా ఎలాంటి చర్యలు చేపడుతారనేది వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement